epaper
Thursday, April 16, 2026
epaper

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం
న‌ల్ల‌బెల్లి బీజేపీ అధ్య‌క్షుడు త‌డ‌క విన‌య్ గౌడ్‌
రుద్రగూడెంలో రైతులతో క‌లిసి రాస్తారోకో

కాకతీయ, నల్లబెల్లి : మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు సరిపడా లేకపోవడం, కొనుగోళ్లు నిలిచిపోవడంతో నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడిచినా మక్కజొన్న కుప్పలు అలాగే పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నప్పటికీ, కేవలం 25 క్వింటాళ్లకే కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు ప్రశ్నించారు. బస్తాలు సరిపడా అందుబాటులో లేకపోవడం, వచ్చినా అరకొరగా ఉండటంతో పంటను పూర్తిగా అమ్ముకోలేకపోతున్నామని తెలిపారు. ఆన్లైన్‌లో భూములకు గరిష్టంగా 25 క్వింటాళ్లే నమోదు చేస్తామనే నిబంధనతో మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎకరాకు పరిమితులు విధించడం, బోనస్ ఇవ్వకపోవడం, అనవసర నిబంధనలు పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో బస్తాలు, కాంటాలు సరిపడా అందుబాటులో లేవని, వెంటనే వాటిని సమకూర్చి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రోజులు గడుస్తున్నా కాంటాలు వేయకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు రెండు నెలలైన...

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన పది రోజులైనా...

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ,గీసుగొండ :...

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. కాకతీయ, హనుమకొండ :...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర...

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు విద్య,...

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్...

ఐటీడీఏలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఐటీడీఏలో అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img