నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు
* సీఐ బానోత్ రమేష్ నాయక్
* విద్యార్థులతో అరైవ్-అలైవ్ అవగాహనపై ప్రదర్శన
కాకతీయ, చేర్యాల: రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే ఈ మేరకు చేర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులతో పోలీస్ స్టేషన్ ఎదురుగ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల సమయంలో బాధ్యతగా వ్యవహరించి క్షతగాత్రులను ఎలా కాపాడాలి వాహనాలపై వెళ్లేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రదర్శన ద్వారా సూచించారు. ఈ సందర్భంగా సిఐ బానోతు రమేష్ నాయక్ మాట్లాడుతూ. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.అర్రివ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత మండలంగా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.మొబైల్ ఫోన్లను రక్షించేందుకు పౌచ్లు, స్క్రీన్ గార్డులు ఉపయోగిస్తున్నప్పటికీ, తమ ప్రాణ రక్షణకు అవసరమైన హెల్మెట్, సీట్ బెల్ట్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ జీ. అపూర్వ రెడ్డి, పోలీస్ సిబ్బంది తో పాటు ప్రయాణికులు, వాహనాదారులు తదితరులు పాల్గొన్నారు.



