గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..
కాకతీయ, హనుమకొండ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, సహాయ కార్యదర్శులు పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ సభ్యులు వీరగోని హరీష్, ఎండీ నయీంపాషా, జర్నలిస్టులు గునిశెట్టి విజయభాస్కర్, దాసరి శ్రీనివాస్, శ్రీహరిరాజు, తొట తిరుమల్, చేతి శ్రీనివాస్, సంపెట వెంకటేశ్వర్లు, ప్రదీప్ రాజ్, సెంసాని మోహన్, కిషోర్, మాడ నర్సయ్య, గజ్జి సురేష్, ఇస్లావత్ దేవేందర్, సునీల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


