epaper
Thursday, April 16, 2026
epaper

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ
కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం
ఫోన్‌లో కుల వివక్ష వ్యాఖ్యల ఆరోపణలు
ఖర్చుల వ్యవహారంతో మొదలై.. ఉద్రిక్త‌త‌కు దారి
పై అధికారులకు చెప్పుకోలేని స్థితిలో ఎస్ఐ?

కాక‌తీయ‌, నిఘా ప్ర‌తినిధి : వరంగల్ పోలీస్ కమిషన రేట్ పరిధిలో ఎస్ఐ–సీఐ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఈస్ట్ జోన్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ములుగు వైపు వెళ్లే జాతీయ రహదారి 163కు ఆనుకుని ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో తీవ్ర పదజాలంతో దూషణలు, కుల వివక్ష వ్యాఖ్యలు చేసుకున్న‌ట్లు స‌మాచారం. అంతర్గత విభేదాలు బహిర్గతమవడంతో శాఖలో స్టేష‌న్‌లో వాతావ‌ర‌ణ వేడెక్కిన‌ట్లు స‌మాచారం. ఇటీవల స్టేషన్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ వారంటీ ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఒడిశా వెళ్లాల్సి వచ్చినట్లు సమాచారం. ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఎస్ఐని సంప్రదించగా, ఎస్‌హెచ్‌ఓ ఉన్నప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు అంటూ తిరస్కరించారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ నేరుగా సీఐకి ఫోన్ చేసి ఖర్చుల కోసం డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహించిన సీఐ, వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. “మీ కులపోడు అని సపోర్ట్ చేస్తున్నావా?”, “మీ కులపొళ్ళు కలిసి నన్ను ఏం చేయలేరు” వంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక “త్వరలోనే ప్రమోషన్ మీద డీఎస్పీ అవుతున్నాను… అప్పుడే మీ సంగతి చూస్తా” అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

రాజకీయ బలం ఉందంటూ వ్యాఖ్యలు?

ఫోన్ సంభాషణలో సీఐ తనకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మద్దతు ఉందని, తనను ఎవరూ బదిలీ చేయలేరని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఎస్ఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణ స్థాయికి చేరినట్లు సమాచారం. “నేను స్టేషన్‌కు వచ్చాక చూస్తా” అంటూ సీఐ ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్‌లో కొన్ని కేసులు, లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఇద్దరి మధ్య ఉండటంతో, ఎస్ఐ కూడా పై అధికారులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. దీంతో సిబ్బంది మధ్య ఉద్రిక్తత పెరిగిందని చెబుతున్నారు. సదరు సీఐ ప్రవర్తనపై ఇప్పటికే అసంతృప్తి ఉందని తోటి సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. గతంలో ఇదే స్టేషన్‌లో పనిచేసిన ఆరుగురు కానిస్టేబుళ్లు వేధింపులు తట్టుకోలేక ఒకేసారి బదిలీ చేయించుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. పనిలో చిన్నచూపు చూడటం, దురుసుగా మాట్లాడటం, అనవసర ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు సిబ్బంది కూడా ఆ అధికారితో కలిసి పని చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. కేసుల నమోదులో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

శాఖ ప్రతిష్ఠకు ముప్పు?

ఈ ఘటనతో స్టేషన్‌లో క్రమశిక్షణ, పరస్పర గౌరవం ప్రశ్నార్థకమైంద‌న్న చ‌ర్చ పోలీసు శాఖ‌లో జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. కుల వివక్ష ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు. శాఖలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవడం, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవడం వంటి అంశాలు పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు రెండు నెలలైన...

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన పది రోజులైనా...

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం న‌ల్ల‌బెల్లి బీజేపీ అధ్య‌క్షుడు త‌డ‌క విన‌య్ గౌడ్‌ రుద్రగూడెంలో...

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ,గీసుగొండ :...

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. కాకతీయ, హనుమకొండ :...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర...

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు విద్య,...

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img