జడ్జి బత్తుల మానసకు సన్మానం
కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్ హుజూరాబాద్‌కు చెందిన బత్తుల మానస జడ్జిగా ఎంపిక కావడంతో ఆమెకు అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137A ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. పట్టణంలోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ మానస సాధించిన ఈ విజయానికి ఆమె కృషి, పట్టుదల ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ స్థాయి పదవిని సాధించడం అభినందనీయమని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు బత్తుల మనోజ్ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, సుద్దపెల్లి ప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి, పుల్లాల శ్యామ్, మాధవరావు, గాలిపెళ్లి నాగేశ్వర్, కుమారస్వామి, ఆచివర్స్ వెంకటేశ్వర్లు, సాయి లక్కీ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా అలయన్స్ క్లబ్ అసోసియేషన్ 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ తెలిపారు.


