epaper
Thursday, April 16, 2026
epaper

చెత్త ప‌నులు చెత్త‌గా

చెత్త ప‌నులు చెత్త‌గా
మ‌హ‌బూబాబాద్‌ మున్సిపల్ కార్యాలయంలో చెత్త‌వేసి నిరసన
నెలరోజులుగా చెత్త సేకరణ లేక ప్రజల ఆగ్రహం
వార్డు కౌన్సిలర్ జేరిన బేగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌

కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో నెలరోజులుగా చెత్త సేకరణ జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో, చెత్త డబ్బాలు, సంచులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలోనే చెత్త పోసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా తమ వార్డులో చెత్తను సేకరించకపోవడంతో దుర్వాసన, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఇతర వార్డుల్లో చెత్త సేకరణ జరుగుతుండగా, తమ వార్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ఘటనపై స్పందించి, వెంటనే 21వ వార్డులో చెత్త సేకరణ చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జేరిన బేగం మాట్లాడుతూ, నెల రోజులుగా మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓటు వేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి వార్డులో చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను కోరారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని, లేకపోతే మరింత తీవ్ర నిరసనలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img