శంకరపట్నంలో ప్రజాపాలన సమావేశం
కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక
కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో గురువారం మండల స్థాయిలో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వల ప్రాజెక్టు, అర్కన్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం వంటి సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్‌కు నివేదించి తదుపరి చర్యల కోసం పంపినట్లు ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
అదేవిధంగా ఆరు కౌంటర్ల ద్వారా పలు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సేవా కేంద్రం, పోషణ అభియాన్‌కు సంబంధించిన స్టాళ్లను కూడా మండల సభలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ కే. సురేఖ, ఎంపీవో కాసాగొని ప్రభాకర్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి కే. వెంకటేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులు, మహిళా సంఘం అధికారులు, వివిధ శాఖల అధికారులు, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


