epaper
Friday, April 17, 2026
epaper

ఎదులాపురం అభివృద్ధి నా బాధ్య‌త‌

ఎదులాపురం అభివృద్ధి నా బాధ్య‌త‌
అభివృద్ధిపై మాట‌లు చెప్ప‌డం కాదు.. చేసి చూపిస్తా
మున్సిపాలిటీని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం
పార్టీల‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు
కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
మర్యాదగా ఉంటే గౌరవిస్తాం… లేకపోతే యుద్ధమే!
మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి

కాకతీయ, కూసుమంచి : “రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది… మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. ప్రజల దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా” అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన తీరుపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు పదేళ్ల దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజా పరిపాలనను తెచ్చుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. “మంచిగా ఉన్నంత కాలమే మర్యాద ఉంటుంది… అది లేకపోతే యుద్ధం చేయాల్సిందే” అంటూ గత పాలకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేవలం కమీషన్ల కోసమే పనులు చేశారని, పేదల ఇళ్ల కంటే దొరల ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని వారు నేడు గొప్పలు చెబుతున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

పార్టీ రంగులు చూడం… పేదరికమే ప్రామాణికం

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు ఎలాంటి తావు లేదని మంత్రి స్పష్టం చేశారు.
“మీరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది నాకు అనవసరం. అర్హులైన పేదవాళ్లయితే చాలు… ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం” అని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏప్రిల్ నుంచి మరో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖునే జీతాలు వంటి సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు.

ఏదులాపురం అభివృద్ధి బాధ్యత నాదే

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. “మీ ఇంటి పెద్దకొడుకుగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తా” అని తెలిపారు. మాటలు చెప్పేవాళ్లను కాదు… పని చేసే వాళ్లను గుర్తించాలని, అభివృద్ధి కోసం నిలబడే వారికే పట్టం కట్టాలని ప్రజలకు సూచించారు.

డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పండి

ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న –
తుమ్మల బిక్షం (10వ వార్డు), పేరం వెంకటలక్ష్మి (11వ వార్డు), నూకల రామ్మోహన్ రెడ్డి (28వ వార్డు), వెంపటి ఉమ (29వ వార్డు), కొట్టం శిరీష (30వ వార్డు), అభ్యర్థులను “హస్తం” గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధికి అడ్డు పడే రాజకీయాలను తిప్పికొట్టాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img