ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం
కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం క్షుద్ర పూజల కలకలం రేపాయి.గుర్తుతెలియని వ్యక్తులు కాలేజీ ఆవరణలో సీసీ రోడ్డుపై క్షుద్ర పూజలు నిర్వహించారు.సీసీ రోడ్డుపై ముగ్గుతో పసుపు కుంకుమతో కూడిన నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు కనిపిస్తోంది.గురువారం
ఉదయం ఆ రోడ్డులో వెళ్లిన కొందరు స్థానికులు వీటిని గుర్తించి గ్రామస్ధులకు సమాచారం ఇచ్చారు.ప్రభుత్వ కాలేజ్ లో క్షుద్ర పూజలు చేయడం ఏంటని,ఈ పూజలు ఎవరికోసం చేశారని స్థానికులు సీరియస్ చర్చించుకుంటున్నారు.


