epaper
Thursday, April 16, 2026
epaper

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం
పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి నాంది
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యం
దోచుకోవ‌డ‌మే ప‌రామావ‌ధిగా ఆ ముగ్గురు ప‌నిచేస్తున్నారు
సీతారామ ప్రాజెక్టు అంచ‌నాలు పెంచి ప్రజా ధనం లూటీకి య‌త్నాలు
దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ద‌శ‌ల వారీగా ఉద్య‌మం
నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో జిల్లాలో 3 నుంచి 4 సీట్లు పెరిగే అవ‌కాశం
19న ఖమ్మంలో జ‌రిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజ‌య‌వంతం చేయాలి
పార్టీ శ్రేణుల‌కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కాకతీయ, వైరా : పేమెంట్ కోటలో సీఎం అయిన రేవంత్ రెడ్డి.. ద‌మ్ముంటే రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ప్ర‌జ‌ల‌కు చూపాలంటూ మాజీమంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ స‌వాల్ విసిరారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరంలో చేసిందని విమర్శించారు. బుధవారం వైరాలోని స్థానిక కట్టా నరసింహారావు స్వగృహంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా పువ్వాడ అజ‌య్ మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని అన్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చి దోచుకోవడమే వారి పరమ విధిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధేంటో వివరాలు తెలియజేయాలని అన్నారు. ఖమ్మంలో వెలుగుమట్ల‌లో భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న 8 20 మందికి కేవలం 310 ఇల్లు మాత్రమే కేటాయించారని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అందరికీ ఇల్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో 15 నియోజకవర్గాలు..!

33% మహిళా బిల్లు ప్రవేశపెడితే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంద‌ని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయ‌ని, వాటి కనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా అడుగులు వేస్తుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు స్వలాభం కోసం ధనార్జ‌న‌నే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడే ధోరణి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. బీఆర్ ఎస్ పార్టీకి కోటి రూపాయ‌ల విరాళం ఇచ్చి.. ప్రభుత్వంలో నువ్వు వేల కోట్లు ల‌బ్ధి పొందిన మాట వాస్తవమా కాదా అని సూటిగా ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు అంచనా పెంచి రూ.19వేల కోట్ల ప్రజాధ‌నాన్ని దోచుకోవడానికి ఈ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు సిద్ధ‌మ‌య్యార‌ని అన్నారు.దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్‌ దశలవారీగా ఉద్యమాలు చేపడతుంద‌ని తెలిపారు. ఈనెల 19న ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి కార్యకర్త హాజరుకావాలని అన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారని సకాలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు కట్టా కృష్ణార్జునరావ్ ,వనమా విశ్వేశ్వరరావు ,బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరావు,అప్పుం సురేష్,కొణిజర్ల మండలం అధ్యక్షులు పోట్ల శ్రీనివాసరావు, ,వార్డు కౌన్సిలర్లు కట్టా స్వరూప రాణి,మాదినేని సునీత, దుర్గాప్రసాద్, దొంతబోయిన వెంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img