epaper
Friday, April 17, 2026
epaper

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  • విజయవంతంకోసం విస్తృత ప్రచారం కల్పించాలి
  • కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కాక‌తీయ‌, కొత్తగూడెం రూరల్ : సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో ఈనెల 12న కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జాబ్ మేళా సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం కేంద్రంగా జరిగే ఈ జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి 10వేల మందికి పైగా హాజరయ్యేలా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. మూడు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళా నిరుద్యోగల పాలిట వరంగా మారుతుందని తెలిపారు.

10వ తరగతి పాస్ అయిన వారి నుంచి మొదలుకుని, ఐటిఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబిఏ, ఎంసిఓ, గ్రాడ్యూయేషన్, పోస్టుగ్రాడ్యుయేట్, బిఇ, బిటెక్, ఎంటెక్, తదితర చదువులు చదివిన వారంతా ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేందుకు హాజరుకావచ్చని చెప్పారు. దిగ్గజ సాఫ్ట్వేర్, ఫార్మసీ కంపెనీలతో పాటు పలు కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేన్ చేయించుకోవాల్సి ఉంటుందని, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వీలుకాని వారు కూడా నేరుగా హాజరై స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 5 కం పెనీలు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు అయ్యే విధంగా టోకెన్ పాస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

ఉద్యోగానికి అభ్యర్థులు ఎంపికైన వెంటనే అక్కడికక్కడే ఆయా కంపెనీలు ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రాలను కూడా ప్రముఖల చేతుల మీదుగా అందిస్తారని చెప్పారు. అనంతరం జాబ్ మేళా ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. తహసీల్దార్ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మురళీధర్, సింగరేణి ఎసీ-2 జిఎం కోటిరెడ్డి, ఏజిఎం (సివిల్) రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) మోహన్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య, జాబ్ మేళా కో-ఆర్డినేటర్ చందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డిఓ మధు, కార్పోరేషన్ కమీషనర్ సుజాత, డీఎస్పీ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాపా, గుర్తింపు సంఘం నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, జి వీరస్వామి, తహశిల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img