epaper
Thursday, April 16, 2026
epaper

‘సర్’పంచ్‌..!

  • గూడెంలో రెండు పార్టీల మధ్య ముదురుతున్న అంతర్గత పోరు
  • చుంచుపల్లి మండలంలో సర్పంచ్‌కు కోటి రూపాయల ఆఫర్‌

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా, గత రెండు విడతల్లో గెలిచిన కొందరు సర్పంచులు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చుంచుపల్లి మండలంలో ఒక పార్టీ మద్దతుతో సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసి సర్పంచ్‌గా గెలిచిన ఓ అభ్యర్థికి తాజాగా భారీ ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం. ‘నీ పదవి నీకే ఉంటుంది… పార్టీ మారితే కోటి రూపాయలు ఇస్తాం’ అంటూ ఓ కీలక నేత ఆఫర్‌ చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి యూనియన్‌లో జిల్లా స్థాయి పదవి ఇప్పిస్తామన్న హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

ముదురుతున్న అంతర్గత కుమ్ములాట

గూడెం ప్రాంతంలో ఇప్పటివరకు పైపైకి దోస్తులుగా ఉన్న రెండు పార్టీల మధ్య పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంతర్గత పోరు తెరపైకి వచ్చింది. ‘మా పార్టీ అభ్యర్థే గెలవాలి’ అన్న పట్టుదలతో నాయకులు వర్గాలుగా చీలిపోయి రాజకీయ సమరానికి దిగినట్లు తెలుస్తోంది. బయటకు పొత్తులు ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ కొనసాగుతోంది.

అభ్యర్థులకు ‘కనకవర్షం’

చుంచుపల్లి మండలంలో పార్టీ మారే యోచనలో ఉన్న అభ్యర్థి పంచాయతీ ఎన్నికల సమయంలో ఇప్పటికే అనేక మందికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీల మధ్య అంతర్గత కుమ్ములాట కారణంగా అభ్యర్థులకు కనకవర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, తాము గెలిచిన పార్టీలో మండల అధ్యక్షుడు ఏకచక్రాధిపత్యం ప్రదర్శిస్తున్నారని, పార్టీలో కొనసాగితే ఆయన చేతిలో కీలుబొమ్మలుగా మారాల్సి వస్తుందన్న ఆందోళనతోనే పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు ఆ సర్పంచ్‌ వర్గం నుంచి బలమైన ప్రచారం వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img