epaper
Friday, April 17, 2026
epaper

కాకతీయ ఎఫెక్ట్‌… టాస్క్‌ఫోర్స్ దూకుడు!

కాకతీయ ఎఫెక్ట్‌… టాస్క్‌ఫోర్స్ దూకుడు!            

అక్రమ ఫైనాన్స్ ముఠాపై చర్యలు       

అధిక వడ్డీల వసూళ్లపై అరెస్టులు

ప్రామిసరీ నోట్లు, కీలక ఆధారాల స్వాధీనం

నిందితుల్ని పోలీసులకు అప్పగింపు      

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాకతీయలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపై బుధ‌వారం దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని ఖానాపురం హవేలీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. దానవాయిగూడెం గ్రామానికి చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు సారధి నగర్‌కు చెందిన శివకుమార్, బానోత్ దీపా కుమారి అనే వ్యక్తులు చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలతో గిరిగిరి ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి అక్రమ ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రామిసరీ నోట్లు, ఇతర కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారం సేకరించి ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

సిగరెట్ల దందాకు చెక్.. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో భారీగా పట్టివేత
రెండు ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు
రూ.2.33 లక్షల విలువైన సిగరెట్లు సీజ్
ఇద్దరు నిందితులు అదుపులోకి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత సిగరెట్లను విక్రయిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కిరాణా షాపులో అనుమతి లేకుండా నిషేధిత సిగరెట్లు విక్రయిస్తున్న కె. సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.84,700గా అధికారులు అంచనా వేశారు.

త్రీటౌన్ పరిధిలో భారీ నిల్వలు
శ్రీనివాస్ నగర్ ఎస్ఎస్వి టవర్స్ సమీపంలో మరో దాడిలో శ్రీరామ్ రమేష్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి అనుమతి లేని నిషేధిత సిగరెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2,33,000గా అంచనా వేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img