epaper
Friday, April 17, 2026
epaper

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే
21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే
ఖమ్మం జిల్లాకు చెందినవారు 522 మంది గుర్తింపు
ఇతర జిల్లాల వారు 107… ఇతర రాష్ట్రాల వారు ముగ్గురు
అర్హుల జాబితా తర్వాత స్థ‌ల‌ పట్టాలు, ఇళ్లు
సంబంధితులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి
అర్హులైన వారికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు
: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్ భూముల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి అర్హులను గుర్తించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వే బాధ్యతలు అప్పగించామని, సంబంధిత వ్యక్తుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు 182 మంది, ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఖమ్మం జిల్లాకు చెందిన వారు 522 మంది గుర్తించబడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు 107 మంది ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు ప్రాథమిక సర్వేలో తేలిందని చెప్పారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, మరికొంత మంది వివరాలు నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

అర్హులకు ఇళ్లు

సర్వే పూర్తైన తర్వాత అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హత ప్రమాణాల ప్రకారం మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా సంబంధిత వ్యక్తులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు అవసరమైన వివరాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించడం ద్వారా అర్హుల గుర్తింపు సులభమవుతుందని తెలిపారు. వెలుగుమట్ల ఘటనలో ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయడమే లక్ష్యమని, ప్రభుత్వం అర్హులైన పేదల పక్షాన నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img