epaper
Friday, April 17, 2026
epaper

సైబర్ నేరాలపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి
డిజిటల్ అరెస్టులు అంతా మోసం
అవగాహన ఉంటే..ఆపదలను నివారించొచ్చు
మణుగూరు సబ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి

కాకతీయ,మణుగూరు : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సరైన అవగాహన ఉంటే ఆపదలను సులభంగా నివారించవచ్చని మణుగూరు సబ్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సూచించారు. బుధవారం సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా సింగరేణి పీకేఓసీ–2 క్యాంటీన్‌లో కార్మికులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం వల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయని, అయితే టెక్నాలజీ అభివృద్ధితో పాటు మోసాలు కూడా పెరిగాయని చెప్పారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

డిజిటల్ అరెస్టు అనేది పూర్తిగా మోసం

“డిజిటల్ అరెస్టు అంటూ ఎక్కడా ఉండదు. కేసులు పెట్టామని, వారెంట్ జారీ చేశామని ఫోన్ చేసి బెదిరిస్తే భయపడవద్దు. ఇవన్నీ సైబర్ నేరగాళ్ల మాయాజాలం మాత్రమే” అని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎక్కువ డబ్బు ఇస్తామని ఆశ చూపించే గ్రూపులు, పెట్టుబడి అవకాశాల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు వచ్చే లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పంపడం, ఆన్‌లైన్‌లో పరిచయమైన వారితో ఆర్థిక లావాదేవీలు జరపడం ప్రమాదకరమని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడంపై ఏరియా జీఎం దుర్గం రాంచందర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఐ పాటి నాగబాబు మాట్లాడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాస చారి, డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్‌బాబు, ఎస్సై శ్రావణ్ కుమార్, సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img