epaper
Friday, April 17, 2026
epaper

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి
సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి
ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి
సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలి
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మండల స్థాయి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

కాకతీయ , కూసుమంచి : జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణతో గ్రామాలలో సమగ్ర మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి ప్రతిష్టాత్మకంగా 99 రోజుల “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 2న గ్రామ స్థాయి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా మండల కేంద్రాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను సాధించాలి

ఇటీవల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్సాహంతో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉన్న సమస్యలను స్థానిక నాయకత్వంతోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పరిష్కరించాలని, ముఖ్యంగా శానిటేషన్, వీధి దీపాల నిర్వహణ, మల్టీ పర్పస్ వర్కర్లకు సమయానికి వేతనాల చెల్లింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయగా, ఖమ్మం జిల్లాకు సుమారు 16 వేల 500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో 2800 ఇళ్లు పూర్తయ్యాయని, 8200 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, తొందరలోనే సుమారు 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతాయని చెప్పారు.

కూసుమంచి మండలంలో 690 ఇళ్లు మంజూరు

కూసుమంచి మండలంలో 690 ఇళ్లు మంజూరు కాగా, ఇంకా ప్రారంభం కాని 43 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా సర్పంచులు, స్థానిక నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. కూసుమంచి మండలంలో కొత్త జూనియర్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలకు పునాది పడిందని, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, 500 గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, క్వింటాల్‌కు 500 బోనస్, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూసుమంచి మండలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్, కూసుమంచి మండల ఇన్చార్జి ఎంపీడీవో రాజారావు, తహసీల్దార్ సైదులు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాణి, హెచ్ ఓ అపర్ణ, ఎంఈఓ వీరస్వామి, ఐసిడిఎస్ ఉమా, వైద్యాధికారి డాక్టర్ సాయి, వెటర్నరీ డాక్టర్ నీలకంఠం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img