epaper
Friday, April 17, 2026
epaper

సీపీఐ అజేయ శక్తని రుజువైంది

సీపీఐ అజేయ శక్తని రుజువైంది
ఏ ఎన్నికలైనా సీపీఐదే పై చేయి
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా
ఒంటరి పోరులో అనూహ్య విజయాలు
స్థానిక నాయకుల తీరుతోనే పొత్తు చెడింది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గెలిచిన సిపిఐ సర్పంచులు, వార్డు సభ్యులు నిస్వార్థంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని ఆయన సూచించారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన నూతనంగా గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం అధ్యక్షత వహించారు.

పోటాపోటీగా ఒంటరి పోరుకు దిగిన సిపిఐ జిల్లా వ్యాప్తంగా 47 సర్పంచ్ స్థానాలను మంచి మెజార్టీతో గెలుచుకుందని, అలాగే 57 ఉపసర్పంచ్ పదవులు దక్కించుకున్నామని తెలిపారు. మొత్తం 432 వార్డుల్లో ఎర్రజెండా రెపరెపలాడుతోందని, ప్రధాన గ్రామ పంచాయితీలు సైతం సిపిఐ ఖాతాలో చేరాయని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే సిపిఐకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కనీస మద్దతు కూడా లభించలేదని, అయినప్పటికీ సిపిఐ స్నేహధర్మాన్ని పాటిస్తూ గతంలో కాంగ్రెస్ సర్పంచులు ఉన్న చోట్ల తమ అభ్యర్థులను నిలబెట్టలేదని చెప్పారు. అయినా కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శించారు. తామేమో విలువలతో కూడిన, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సిపిఐదే పై చేయి ఉంటుందని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాల నిర్ణయాల మేరకు కార్యచరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటమి పాలైన వారు నిరాశ చెందకుండా రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img