epaper
Friday, April 17, 2026
epaper

అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తాం

  • రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గిరిజన భవన్‌లో ములుగు, మల్లంపల్లి మండలాల అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడి టీచర్లు, ఆయాలకు ఏకరూప దుస్తులను (యూనిఫాం) అందజేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలలను మూసివేస్తున్నారన్న ప్రచారం అసత్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయని వివరించారు. పిల్లలకు పౌష్టికాహారం, మంచి సంరక్షణ అందేలా అంగన్వాడి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని, సోలార్ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు.

ప్రతి మహిళా సంఘం భరోసా, తోటి సభ్యులు కష్టసుఖాల్లో తోడుంటారని, ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ములుగు నియోజకవర్గంలో పదివేల మందికి పైగా రేషన్ కార్డులు పంపిణీ చేసిందని, కొత్తగా కార్డులు అందజేయడమే కాకుండా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని వివరించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు అండగా నిలవాలని ఆమె కోరారు. తరువాత డీఎల్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్.మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, డీడబ్ల్యూఓ తుల రవి, డీసీఎస్ఓ షా ఫైజల్ హుస్సైనీ, సిడిపిఓలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, రేషన్ కార్డు లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img