epaper
Friday, April 17, 2026
epaper

ఆదివాసీ యోధుడు కొమురం భీం

  • జాతి కోసం త‌ర‌త‌రాలు చెప్పుకునేలా పోరాడారు
  • ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే ఉద్యమం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాక‌తీయ‌, తెలంగాణ డెస్క్ : తెలంగాణ మన్నెంపులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ అన్నారు. కొమురం భీం వ‌ర్దంతి సంద‌ర్భంగా ట్యాంక్ బండ్‌పై విగ్రహానికి పూల‌మాల‌వేసి నివాళుల‌ర్పించారు. కొంతమంది జననం చరిత్ర అయితే… మ‌రికొంద‌రి మరణం చరిత్ర అవుతుంద‌న్నారు. కొమురం భీం తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను సాధించి పెట్టార‌ని కొనియాడారు.

మావా నాటే మావా రాజ్’ అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలని పిలుపునిచ్చార‌న్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వాన్ని తలవంచేలా చేశార‌ని అన్నారు. ఇప్పటికీ కొమురం భీం గౌరవార్థం ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నమంటే అది ఆయన గొప్పతనం అన్నారు. కొమురం భీంకు నివాళిగా జోడే ఘాట్ వద్ద స్మృతివనం కట్టుకున్నామ‌ని, తెలంగాణ వచ్చాక ఆయనకు తగిన గౌరవం ఇచ్చుకున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక గూడెల్లో అభివృద్ధి ఆగిపోయింద‌ని ఆరోపించారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింద‌ని మండిప‌డ్డారు. ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామ‌ని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతిలో బీఎస్పీ నేతల చేరిక

తెలంగాణ జాగృతిలో కామారెడ్డి జిల్లా బీఎస్పీ నాయకులు చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బీఎస్పీ నాయకుడు తలారి బాలరాజ్ జాగృతిలో చేరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బడుగు, బలహీనవర్గాల పక్షాన కవిత చేస్తున్న పోరాటాలకు మద్దతునిచ్చేందుకే జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img