epaper
Thursday, April 16, 2026
epaper

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు

బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు

కాంగ్రెస్ ఎన్న‌డూ అంబేద్క‌ర్‌కు గౌర‌వం ఇవ్వ‌లేదు

వారి ప్రభుత్వం ఉన్నంత కాలం భారతరత్న ఇవ్వలేదు

రాష్ట్రంలోని గురుకులాల్లో మ‌ర‌ణ మృదంగం

‘జై భీమ్, జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో ముందుకు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మహనీయుడు అంబేద్కర్‌.. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే తత్వాన్ని కేసీఆర్ అనుసరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ బడుగు, బలహీన వర్గాల వికాసం కోసం, సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కీర్తించారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంబేద్కర్‌ మార్గాన్నే అనుసరించారని కేటీఆర్‌ చెప్పారు. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్‌ తత్వాన్ని అనుసరించి.. కేసీఆర్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు బోధించారని, అందుకోసం లక్షల మందిని సమీకరించారని, అందరినీ కలుపుకుని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని గుర్తుచేశారు. పోరాడితే పోయేదేమీ లేదన్న శ్రీశ్రీ చెప్పిన మాట నిజం అయిందని.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సంకెళ్లు వేసి బందీ చేసిందని ఆరోపించారు. ఈసారి బందీ చేస్తే సంకెళ్లు బద్దలు కొడతామని పిలుపు ఇచ్చిన వెంటనే విగ్రహాన్ని ఓపెన్ చేశారని వ్యాఖ్యానించారు.

అంబేడ్కర్‌‌కు గౌరవం ఇవ్వలేదు…

అంబేడ్కర్ తత్వం ‘బోధించు, సమీకరించు, పోరాడు’తోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. గురుకులాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోంది తప్ప.. ఎన్నడూ నిజమైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదన్నారు. అంబేడ్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయకుండా ఆయనను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు లాంటి పథకాలను తీసుకొచ్చిన కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.

మూసి కాంట్రాక్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారా…

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవకాశాలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి విమర్శించారు. లక్షన్నర కోట్ల కాంట్రాక్టుల్లో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. మూసి కాంట్రాక్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ మోసాలను రాష్ట్రంలోని ప్రతి దళిత, బీసీ, మైనార్టీ కుటుంబాలకు చేర్చి పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతాని ప్రకటించారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే..

పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేశామని.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఏ మాత్రం గౌరవం ఉన్నా స్పందించే వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. అంబేడ్కర్ అంటే గిట్టని వారే అని విమర్శించారు. అంబేడ్కర్‌ను కొందరి వాడుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. మహాత్మా గాంధీ లాగే అంబేడ్కర్ అందరి వాడని స్పష్టం చేశారు. ‘జై భీమ్, జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో ముందుకు సాగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

కరెంటు ఇవ్వరు? రైతుబంధు వేయరు..

కరెంటు ఇవ్వరు? రైతుబంధు వేయరు.. పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img