తెలంగాణ అంబేద్కర్ బిక్షే..
ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు
బాబాసాహెబ్ ఒక వ్యక్తి కాదు.. ఐడియాలజీ
దళితుల భూములు గుంజుకుంటున్న పాలకులు
మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయి
పేదలకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటాలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగానే రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిందన్నారు. అంబేడ్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు.. ఆయన ఒక ఐడియాలజీ అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని విమర్శించారు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగానైనా ఆయనకు బుద్ది వచ్చి పేదలకు మంచి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భం గా ట్యాంక్ బండ్‌పై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఆర్టికల్ 3 లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వాళ్లం కాదన్నారు. వచ్చిన తెలంగాణలో అంబేడ్కర్ కోరిక ప్రకారం స్టేట్ సోషలిజం వర్థిల్లాల్సి ఉండే. కానీ 12 ఏళ్లలో దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి మాత్రం రాలేదు. ఇప్పటికీ కూడా ప్రతి చోట దళితులు, మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులే భూములు కోల్పోతున్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వాలు లాక్కుంటున్నాయి. ఈ పరిస్థితిని సవరించుకుంటూ పేదల భూములను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఇది. మనం వెలుగుమట్లలో చూశాం. పరిగిలో కూడా అసైన్డ్ భూములనే పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. అక్కడ 12 వందల ఎకరాలు సేకరిస్తే అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములే. బాబా సాహెబ్ అంటేనే ధైర్యం. ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. బాబా సాహెబ్ ఆడబిడ్డలకు ఎంతో మంచి చేశారు. ఆయన స్ఫూర్తితో ఇంకా ఎన్నో ఉద్యమాలు వచ్చి మన కష్టాలు అన్ని తొలగిపోవాలి. బాబా సాహెబ్ 135 వ జయంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఫోరమ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించటం సంతోషం


