epaper
Friday, April 17, 2026
epaper

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు
రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి జరగాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం

కాక‌తీయ‌, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగాల ఘనపూర్ మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.60.06 లక్షల చెక్కులను, రఘునాథపల్లి మండలానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు రూ.95.11 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ఈ సంద‌ర్భంగా క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అశ్వరావుపల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్లను నింపి కాలువల ద్వారా లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రెండో పంటకూ పూర్తి స్థాయిలో నీరు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img