epaper
Friday, April 17, 2026
epaper

Kaleshwaram Project ON ACB: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి.. ఏసీబీ విచారణకు రంగం సిద్ధం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి కేసులపై త్వరలోనే అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరిపి, వాటిపై తక్షణ చర్య అవసరమని సూచిస్తూ ఏసీబీకి లేఖ రాసింది. విజిలెన్స్ నుంచి వచ్చిన ఈ లేఖను ఏసీబీ డీజీ తెలంగాణ సీఎస్‌కు పంపించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు అధికారికంగా విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.

ఇంతకుముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురు కీలక అధికారుల వద్ద ఏసీబీ పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు, డబ్బును గుర్తించింది. ముఖ్యంగా ఈఎన్సీ, ఈఈ స్థాయి ఇంజినీర్ల వద్ద భారీగా అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల అమలు, టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు చాలా కాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజల వేల కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాజెక్టులో వినియోగించిన నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు క్రమంగా ఆధారాలు సేకరిస్తుండటంతో, త్వరలోనే పెద్దఎత్తున విచారణ జరగడం ఖాయమని భావిస్తున్నారు.

విజిలెన్స్ అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా, ఏసీబీ విచారణలో అవినీతి ముసుగులో దాచిన ఆర్థిక లావాదేవీలు, అవకతవకలు బయటపడతాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి రాగానే ఈ దర్యాప్తు ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఒకసారి ఏసీబీ విచారణ మొదలైతే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి రాక తప్పదని నిపుణుల అంచనా.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img