epaper
Friday, April 17, 2026
epaper

రేవంత్‌రెడ్డి భాష మార్చుకో..

  • జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామ‌న్న ప్ర‌స్టేష‌న్‌లో సీఎం
  • కాంగ్రెస్‌ అభ్యర్థి న‌వీన్‌యాద‌వ్ బెదిరింపులు
  • కాంగ్రెస్‌ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలు
  • బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నార‌ని, గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి ఇలాంటి భాష మాట్లాడ‌లేద‌ని బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ మండిప‌డ్డారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామ‌న్న ప్ర‌స్టేష‌న్‌లో నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బజారు భాష మాట్లాడార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. హైదరాబాద్ ను మున్సిపల్ శాఖ మంత్రిగా హోంమంత్రిగా బాగు చేయడంలో విఫలమయ్యాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి మద్దతుతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాల్క సుమన్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో పారిశ్రామిక రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగం పెరిగిందని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో పెట్టుబడులకు తెలంగాణ గేట్‌వే ఆఫ్‌ ఇండియాగా ఉంటే.. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ గన్‌ కల్చర్‌కు అడ్డగా మారిందని బాల్క సుమన్‌ విమర్శించారు.

ర‌ణ‌రంగంగా జూబ్లీహిల్స్‌..

జూబ్లీహిల్స్‌ సంగమం లాంటి నియోజకవర్గమని బాల్క సుమన్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో తిరోగమన దిశగా కొనసాగుతోందని బాల్క సుమన్‌ విమర్శించారు. వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం లేదని మండిపడ్డారు.ఆరు గ్యారంటీలు అన్నారని.. ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. రైతు డిక్లరేషన్‌ అన్నారని.. రైతులకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్‌ చేశారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్‌లో దిగారని.. జూబ్లీహిల్స్‌ను రణరంగంగా మార్చేశారని అన్నారు. ఆడబిడ్డ కన్నీళ్లపై డ్రామా అని మంత్రులు మాట్లాడుతున్నారని.. గోపీనాథ్‌ కూతుళ్లు ప్రచారం చేస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img