epaper
Friday, April 17, 2026
epaper

త్వరలోనే హైడ్రోజన్ బాంబు.. రాహుల్ వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయాలు..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓట్ల చోరీపై సంచలన సమాచారాన్ని త్వరలో బయటపెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. ఇది సాధారణ ఆరోపణ కాదని, “ఆటమ్ బాంబు కంటే హైడ్రోజన్ బాంబు శక్తివంతమైనదే” అన్న పోలికతో తన మాటలకు మరింత బలం చేకూర్చారు. ఆ వివరాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందింది. ససారంలో ఆరంభమైన ఈ యాత్ర, 16 రోజులు పాటు 25 జిల్లాలు, 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,300 కిలోమీటర్ల మేర కొనసాగింది. చివరగా పట్నాలో ముగిసిన ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ, “బిహార్ విప్లవ రాష్ట్రం. ఇక్కడి ప్రజలు ఓట్ల దొంగతనాన్ని తట్టుకోలేరని స్పష్టమైన సందేశం ఇచ్చారు” అని అన్నారు.

మహాగఠ్‌బంధన్‌కు చెందిన నేతలు కూడా ఈ సభలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, “బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కలిసి నితీశ్‌కుమార్‌ను వాడేసి పడేయబోతున్నాయి” అని అన్నారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా నితీశ్ పాలనపై విరుచుకుపడి, ఆయన అవినీతిలో ‘భీష్మపితామహుడు’గా మారిపోయారని ఎద్దేవా చేశారు.

మరోవైపు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “రాహుల్ దేశ ఓటర్లను అవమానపరుస్తున్నారు. బీజేపీ విజయాలను మోసం, ఓట్ల చోరీతో అనుసంధానించడం బాధ్యతారహితమైన చర్య” అని అన్నారు. అంతేకాకుండా, “ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత హోదాను దిగజారుస్తున్నాయి. అణు బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటి పోలికలకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం?” అని ప్రశ్నించారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బిహార్ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. ఒకవైపు కాంగ్రెస్, మహాగఠ్‌బంధన్ నేతలు బీజేపీపై ప్రజాస్వామ్యం కాపాడే పేరుతో దాడి చేస్తుండగా, మరోవైపు బీజేపీ దీనిని ఓటర్లపై అవమానకరమైన వ్యాఖ్యగా అభివర్ణిస్తోంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన “హైడ్రోజన్ బాంబు” వివరాలు నిజంగానే వెలుగులోకి వస్తాయా అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img