epaper
Friday, April 17, 2026
epaper

జ‌న‌వ‌రి 3న కొండ‌గ‌ట్టుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌వ‌రి 3న కొండ‌గ‌ట్టుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో అభివృద్ధి పనులు

దీక్షా విరమణ మండపం, భారీ సత్రాల నిర్మాణాలకు భూమిపూజ

ఏపీ డిప్యూటీ సీఎంకు అంజ‌న్న‌తో ప్ర‌త్యేక అనుబంధం

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం

అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈసందర్భంగా ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈమేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్గశిర పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో చేయనున్న ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. టీటీడీ నిధులతో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. 100 గదుల అత్యాధునిక ధర్మశాలకు భూమిపూజ చేయనున్నారు. ఒకేసారి 2,000 మంది భక్తులు హనుమాన్ దీక్షను విరమించేలా భారీ మండపాన్ని నిర్మించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరచే దిశగా ఉండనున్నాయి.

ప్రత్యేక అనుబంధం

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ఇదే ఆలయం నుంచి ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొండగట్టుకు వచ్చి అంజన్న స్వామిని దర్శించుకోవడం పవన్ కల్యాణ్ విశేషంగా భావిస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కల్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతంలో భక్తులు, ఆయన అభిమానుల భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img