epaper
Friday, April 17, 2026
epaper

మొంథా.తుపాను ప్రభావం.

మొంథా.తుపాను ప్రభావం.
ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలు..
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర.

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వివరాల ప్రకారం ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం తాడ్వాయి మండలంలో నమోదైంది.
తాడ్వాయి మండలం కేంద్రంలో 13.0 మి.మీ, తాడువాయి హట్స్‌లో 11.8 మి.మీ, మేడారం వద్ద 7.3 మి.మీ వర్షపాతం నమోదైంది.గోవిందరావుపేట మండలం – 2.3 మి.మీ వర్షం కురిసింది.వెంకటాపురం మండలం – అలుబాక వద్ద 1.0 మి.మీ, వెంకటాపురం వద్ద 0.8 మి.మీ వర్షం పడింది.ములుగు, వాజేడ్ మండలాలు – తలా 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది.మంగపేట మండలం – 0.5 మి.మీ వర్షం కురిసింది.మొత్తం జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

కలెక్టర్ దివాకర అధికారులతో సమీక్ష…

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంట కోతలను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో వర్షం వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలనీ ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు తమ పరిధిలోని చెరువులు, కాలువలు, కాజ్‌వేలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించాలని, శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు….

వర్షాల కారణంగా అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-7109 వద్ద 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షం, వరదలతో సంబంధిత సమస్యలు వచ్చిన వెంటనే ప్రజలు ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చని చెప్పారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులు, బృందాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని, అయితే వచ్చే 48 గంటలు కీలకమని కలెక్టర్ తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందీ రాదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img