epaper
Friday, April 17, 2026
epaper

మాస్టర్ ప్లాన్‌తో గ్రామాల అభివృద్ధి

  • ప్రజా ప్రభుత్వ లక్ష్యం నాణ్యమైన విద్య
  • గుత్తికోయ గూడెంలో పాఠశాల భవనాల ప్రారంభం
  • ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా అభివృద్ధి పథంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ఏటూరు నాగారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు, అలాగే ఏడున్నర కోట్ల రూపాయల బస్ డిపో నిర్మాణానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మాస్టర్ ప్లాన్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు.

ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌గా, ఐదు మండలాల కేంద్రంగా ఉన్నందున దీనిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాం అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. బస్సు డిపో ఏర్పాటుతో ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఊపిరి వస్తుందన్నారు. ఏటూరు నాగారం నుంచి గోదావరి వరకు రెండున్నర కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఏటూరు నాగారంలో ప్రతిష్టాత్మకంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాబోయే రోజుల్లో గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ వంటి అభివృద్ధి పనులను కూడా చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్, చేన్నాపురం తోగు, లవ్వల స్టేజీ, జలగలంచ ప్రాంతాల్లో మూడు లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని, గుత్తికోయ పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో అడవి ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని గుత్తికోయ హాబిటేషన్లలో సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. జలగలంచ ప్రాంతం రహదారికి దగ్గరగా ఉండటం వల్ల పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అనంతరం గుత్తికోయ చిన్నారులతో మంత్రి ముచ్చటించడం చిన్నారుల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాలలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img