epaper
Friday, April 17, 2026
epaper

డీసీసీల ఎంపిక తుది ద‌శ‌కు !

డీసీసీల ఎంపిక తుది ద‌శ‌కు !

ఢిల్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి..

మంత్రి ఉత్త‌మ్‌, పీసీసీ ఛీఫ్ మ‌హేష్‌గౌడ్ కూడా..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో నేత‌ల భేటీ

జిల్లా కాంగ్రెస్ సార‌థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు

త్వ‌ర‌లోనే తుది జాబితా ప్ర‌క‌ట‌న‌

ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయోన‌ని ఆశావ‌హుల్లో ఉత్కంఠ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఉదయం రాజ‌ధానికి వెళ్లిన ఆయ‌న పార్టీ పెద్ద‌ల‌తో స‌మావేశం అయ్యారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన తుది కసరత్తులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. వర్గాల వారీగా ఒక్కో కమిటీకి ఆరుగురితో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సీఎం రేవంత్‌, భట్టి, మహేశ్‌ గౌడ్‌, మీనాక్షి.. తమ అభిప్రాయాలు వినిపించారు. 39 జిల్లాలతోపాటు పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు తుది జాబితా ప్రకటించ‌నున్నారు.

వారికి ప‌ద‌వులు రావు

సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం ఐదు ఏళ్లు పార్టీలో పని చేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్ఠానం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకుని లిస్ట్‌ ఫైనల్‌ చేస్తుందని, సామాజికన్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వరాదనే నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదు అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

కొత్త ఉత్సాహం

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్‌ను ఇచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు అందించిన ఈ రిపోర్టుల ఆధారంగానే డీసీసీ పదవులు ఖరారు కానున్నాయి. ఈ రిపోర్టులపై లోతైన విశ్లేషణ, చర్చ అనంతరం తుది నిర్ణయానికి రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థాగత నియామకాలు జరుగుతున్నాయి. ఈ నియామకాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఎంతో ముఖ్యమైనది. ఇది పార్టీ యంత్రాంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img