epaper
Friday, April 17, 2026
epaper

శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం
కలెక్టర్ జితేష్ పాటిల్
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదానం
ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు ..

కాకతీయ, కొత్తగూడెం రూరల్: స్వచ్ఛత ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడు నిరంతరం ఆచరించాల్సిన బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు సమాజంలో నిత్యకృత్యంగా కొనసాగితేనే ఆరోగ్యవంతమైన శుభ్రమైన పచ్చదనంతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని పిలుపునిచ్చారు. భారత ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్ర‌మ‌దానంతో విశ్వవిద్యాలయం ఆవరణలోని గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇంటి నుండి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి వద్దే చెత్తను వేరువేరు డబ్బాల్లో వేసి సక్రమంగా పారవేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదన్నారు. మురుగు కాలువల్లో చెత్త పడితే నీటి ప్రవాహం ఆగిపోతుందని, దాంతో దోమల పెరిగి పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయ‌న్నారు. పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులతో పాటు విద్యార్థులు, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే భవిష్యత్ తరాలకు పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన సమాజాన్ని అందించగలమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛతకు కట్టుబడి ప్రతిజ్ఞ చేసి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ముందడుగు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏడీ మైన్స్ దినేష్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏడీ రమేష్, మెప్మా పీడీ రాజేష్, జిల్లా ఉద్యోగులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img