epaper
Monday, March 2, 2026
epaper

కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..?

కాకతీయ, వరంగల్ బ్యూరో : కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు ..? అంటూ రఘునాథపల్లి మండలం భారత రాష్ట్ర సమితి నాయకులు కొత్త ఆలోచనతో పోస్టర్లను అతికించారు. జనగామ జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ నేతలు రఘునాథపల్లి లో అతికించిన పోస్టర్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.

కడియంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు..

కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ ప్రారంభమైన పోస్టర్లలో విద్యావేత్త, నీతి – నిజా యితీకి మారుపేరుగా చెప్పుకుంటున్న కడియం స్టేషన్ ఘన్పూర్ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి నిజంగా మీరు ఉమ్మడి వరంగల్ సీనియర్ నాయకులు అయితే భారత రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలు & స్పీకర్ ఆధేశాల పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉన్న తక్షణమే మీ పదవికి రాజీనామ చేసి, మీ నిజాయితిని ప్రజాక్షేత్రంలో నిరుపించుకోగలరు అని ఉన్న పోస్టర్లు ఇప్పుడు జనగామ జిల్లాలో కలకలం రేపుతుంది. బీఆర్‌ఎస్ స్థానిక నేతలు కడియం శ్రీహరి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా నిలబడటానికి తాము చేసిన కృషినే కారణమని స్పష్టం చేశారు. తాము రాత్రింబవళ్ళు కష్టపడి పోరాడక పోతే కడియం కి పదవి దక్కేదే కాదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మార్పు గురించి ఆలోచించడం అనైతికమని, వెంటనే పదవి నుంచి రాజీనామా చేయాలని స్పష్టమైన డిమాండ్ చేశారు.

కడియం వర్గీయుల ప్రతిస్పందన..

దీనిపై కడియం వర్గం మాత్రం భిన్నంగా స్పందించింది. కడియం శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ప్రజాసేవే ధ్యేయంగా కొనసాగారు. ఆయనకు వచ్చిన పదవులు ఆయన విద్యా నేపథ్యం, కృషి, నైపుణ్యం వల్లే సాధ్యమయ్యాయి. పార్టీ మార్పు చేయాలా వద్దా అనేది ఆయన స్వతంత్ర నిర్ణయం. దానికి బలవంతంగా రాజీనామా చేయమని చెప్పడం సరైంది కాదు అని వర్గీయులు వాదిస్తున్నారు.

కడియం – రాజయ్య మధ్య పాత విభేదాలు..

జనగామ జిల్లాలో కడియం శ్రీహరి – రాజయ్య మధ్య విభేదాలు కొత్తవి కావు. బీఆర్‌ఎస్ పాలనలోనే ఈ ఇద్దరి మధ్య శక్తి పోరు బహిరంగంగానే సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు స్థానికంగా వర్గ పోరాటానికి దారి తీసాయి. ఇప్పుడు కడియం నిర్ణయం నేపథ్యంలో ఆ విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చి, ఇరు వర్గాల అనుచరులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

పోస్టర్లతో పెరిగిన రాజకీయ వేడి..

రఘునాథపల్లిలో అతికించిన ఈ పోస్టర్లు కేవలం స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. పోస్టర్లలో కడియం శ్రీహరి గతంలో పొందిన గౌరవాలు, పదవులు గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం రేకెత్తించారు. కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనగామ రాజకీయాల్లో పెద్ద మార్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగితే రాజయ్య వర్గంతో సమరశీల పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, పార్టీ మారితే స్థానిక సమీకరణాలు పూర్తిగా మారిపోయి, రాబోయే ఎన్నికల్లో అనూహ్య ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భవిష్యత్తు ఏంటి..?

ప్రస్తుతం కడియం శ్రీహరి మౌనం పాటిస్తున్నా, ఆయన తదుపరి అడుగు ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. రాజీనామా చేసి కొత్త దిశలో ప్రయాణిస్తారా.? లేక బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగుతారా.? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img