అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ
కాకతీయ, హనుమకొండ : వరంగల్, హనుమకొండ రోడ్డు రవాణా శాఖ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర సీఐడీ,ఏసీబీ, ఉమెన్ సేఫ్టీ విభాగాల అదనపు డీజీపీ చారు సిన్హా హనుమకొండలోని పోలీస్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ భేటీలో డీసీపీలు ధార కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, సీఐడీ అదనపు ఎస్పీ జితేందర్, ఏసీబీ డీఎస్పీ సాంబయ్యతో పాటు సీఐడీ, ఏసీబీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


