epaper
Friday, April 17, 2026
epaper

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది
మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక

కాకతీయ, ములుగు ప్రతినిధి: తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క, అలాంటి చర్యలను ఇకపై అసలు సహించబోమని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారంపండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా స్థాయిలో ఇలాంటి కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు హాజరుకావడం ఇదే తొలిసారి కావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పార్టీ పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ప్రజల కోసం పని చేస్తేనే గుర్తింపు వస్తుందని తెలిపారు. పని చేయని వారిని పార్టీ పక్కన పెడుతుందని హెచ్చరించారు. కష్టపడి పనిచేసిన నాయకులకే ఉన్నత పదవులు వస్తాయని, అందుకు ఉదాహరణగా మహేష్ గౌడ్ ఎదుగుదలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు.

గత పదేళ్లలో తెలంగాణను తమ సొంత ఆస్తిగా భావించిన నాయకులు ఇప్పుడు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించం. తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు నష్టం దావాలు వేస్తామని తెలిపారు. ఇప్పటికే కొంతమందిపై సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చెప్పారు. మొదట 14,000 రూపాయల కోట్ వచ్చినప్పటికీ దాన్ని రద్దు చేసి, చివరకు 11,650 రూపాయలకు ఫోన్లు కొనుగోలు చేశామని వివరించారు.

ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయని అన్నారు. బస్సు ఉచిత ప్రయాణం, మహిళలకు రుణాలు, రైతులకు మద్దతు వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు అసహనం పెరుగుతోందని విమర్శించారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. పనుల్లో లోపం ఉంటే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కొని పార్టీ ప్రతిష్టను కాపాడాలని సీతక్క పిలుపునిచ్చారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించాలి, అవసరమైతే కేసులు పెట్టాలి అని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img