epaper
Sunday, March 1, 2026
epaper

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?
సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?!
ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం
వేరే శాఖ‌లోకి వెళ్తూ..వెళ్తూ అధికారి క‌ల‌ప స్కాం
ల‌క్ష‌ల విలువ చేసే క‌ర్ర‌ను సొంతిట్లో దాచేసిన అధికారి
ఆరోప‌ణ‌లు రావ‌డంతో నామ‌మాత్రంగా విచార‌ణ‌
ఆ త‌ర్వాత గ‌ప్ చూప్‌.. ఇప్ప‌టికీ అధికారి ఇంట్లోనే అక్ర‌మంగా నిల్వ‌
స్వాధీనం చేసుకోకుండా మీన మేషాలు
జిల్లా అట‌వీశాఖ ఉన్న‌తాధికారుల వైఖ‌రిపై పెరుగుతున్న అనుమానాలు
ములుగు జిల్లాకు స‌మీపంలో రేంజ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన అధికారి
ఇటీవ‌లే మ‌రో క‌న‌క వ‌ర్షం కురిపించే మ‌రో శాఖ‌లో పోస్టింగ్‌
అట‌వీ అధికారిగా ఉన్న‌ప్పుడు అంతా నా ఇష్టం అన్న‌ట్లుగా వ్య‌వ‌హారించిన వైనం

కాక‌తీయ‌, నిఘా ప్ర‌తినిధి : ములుగు అటవీశాఖలో క‌ల‌ప మాయం కలకలం రేపుతోంది. అక్రమ రవాణా కేసులో స్వాధీనం చేసుకున్న లక్షల రూపాయల విలువైన కలప గల్లంతైందన్న ఆరోపణలు చర్చకు దారి తీస్తున్నాయి. అధికారిక రికార్డుల్లో సీజ్ చేసినట్లు నమోదు ఉన్నప్పటికీ, ఆ కలప మొత్తం డిపోలో అందుబాటులో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లాకు సమీపంలోని ఒక రేంజ్‌లో పనిచేసిన అధికారి విధుల్లో ఉన్న సమయంలో స్వాధీనం చేసిన కలపలో కొంత భాగాన్ని అధికారిక గోదాములో కాకుండా తన సొంతింట్లోనే నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో శాఖలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. అయితే బహిరంగంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది.

సీజ్ చేసిన కలపపై సందేహాలు

అటవీ సిబ్బంది కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ డిపోలో ఉన్న నిల్వ పరిమాణం, సీజ్ జాబితాలో ఉన్న పరిమాణంతో సరిపోలడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన కలపలో కొంత భాగం సంబంధిత అధికారి నివాసంలోనే ఉందని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఇది నిజమైతే అధికార దుర్వినియోగానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను వ్యక్తిగతంగా దాచుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆరోపణలు వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. కానీ ఆ విచారణ ఫలితం ఏంటన్నది ఇప్పటివరకు వెల్లడించలేదు. కలపను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై కూడా స్పష్టత లేదు. దీంతో శాఖ వైఖరిపై అనుమానాలు పెరుగుతున్నాయి.

మ‌రో శాఖ‌కు అధికారి జంప్‌..

ఇదిలా ఉండగా సంబంధిత అధికారి ఇటీవలే మరో శాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. కీలక సమయంలో బదిలీ జరగడం, ఆ తర్వాత వ్యవహారం స్తబ్దుగా మారడం యాదృచ్ఛికమా అన్న చర్చ సాగుతోంది. అటవీ అధికారిగా ఉన్న సమయంలో “అంతా నా ఇష్టం” అన్నట్లుగా వ్యవహరించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల మౌనం పరిస్థితిని మరింత సందిగ్ధంలోకి నెట్టింది. సీజ్ వివరాలు, నిల్వ వివరాలు, విచారణ పురోగతిపై పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని ప్రజా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సీజ్ చేసిన కలప పూర్తిగా డిపోలో ఉందా? అధికారి ఇంట్లో నిల్వ ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? విచారణ నివేదిక ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? బాధ్యులపై చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ములుగు అటవీశాఖలో కలప మాయం వ్యవహారం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. స్పష్టత రాకపోతే శాఖ ప్రతిష్ఠకే మచ్చ పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...
spot_img

Popular Categories

spot_imgspot_img