epaper
Friday, April 17, 2026
epaper

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే
రాష్ట్ర అభివృద్ధి ఆలోచ‌న చేయ‌డం లేదు
మూసీ ప్రాజెక్టు అంచ‌నాలు పెంచి ల‌క్ష కోట్లు దాటించారు
ఇప్ప‌టికే ఎన్టీపీసీ దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్‌
అయినా కొత్త ప్రాజెక్టుల స్థాప‌న‌ దేనికోసం..?! ఎవ‌రి కోసం??!
భూ స్కాం కోస‌మే హిల్ట్ పాల‌సీ…అది టిల్ట్ పాల‌సీ
ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు
రాష్ట్ర ప్ర‌భుత్వం, కాంగ్రెస్ నేత‌ల‌పై మాజీమంత్రి పొన్నాల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : దోపిడీ ధ్యాస త‌ప్పా.. రాష్ట్ర అభివృద్ధి ఆలోచ‌న లేకుండా కాంగ్రెస్ ప‌రిపాల‌న కొన‌సాగుతోంద‌ని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత‌ పొన్నాల ల‌క్ష్మ‌య్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి లక్ష కోట్లు దాటించార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఉద్దేశించి అన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవ‌ని అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్ర‌సాద్‌తో క‌ల‌సి పొన్నాల ల‌క్ష్మ‌య్య విలేక‌రుల‌తో మాట్లాడారు. .రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆలోచనతో పని చేస్తోందో అర్థం కావడం లేద‌ని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాజకీయం చేస్తున్నార‌ని అన్నారు.

కొత్త విద్యుత్ ప్రాజెక్టుల స్థాప‌న ఎందుకోసం…!

విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకోస‌మో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. .పవర్ లోడ్ ఫాక్టర్ గురించి తెలియని వాళ్ళు పవర్ గురించి మాట్లాడుతున్నార‌ని అన్నారు. పీక్ లోడ్ ఫాక్టర్ 5 నుంచి 9 శాతం కూడా లేద‌ని, దీనికి కొత్త ప్లాంట్ల అవసరం ఎందుకు ? సొమ్మును సంపాదించుకునే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వ పెద్దలకు రాష్ట్ర అభివృద్ధి ఆలోచన లేద‌ని అన్నారు. అణు విద్యుత్ గురించి ఎపుడైనా ఆలోచించారా ? అంటూ ప్ర‌శ్నించారు. శాశ్వత ప్రాతిపదికన కాలుష్యం పెంచే ప్రాజెక్టులు అవసరమా ? అన్నారు. బ్యాటరీ స్టోరేజ్ పవర్ ఏ పరిస్థితుల్లో వాడుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియద‌న్నారు. తుమ్మిడి హట్టి నుంచి సుందిళ్ల కు నీళ్ళు ఎత్తి పోసి అటు నుంచి ఎల్లంపల్లి కి నీళ్లు తరలించడం గురించి సాగునీటి శాఖ మంత్రి మాట్లాడుతున్నార‌ని, అసలు ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోశారో మంత్రి చెప్పగలరా ? అంటూ ప్ర‌శ్నించారు. ఎల్లం పల్లి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీళ్ల సంగతి ఏంటీ ? తుమ్మిడి హట్టి సుందిళ్ల పేరుతో 9 నుంచి పన్నెండు వేల కోట్లు వృథా చేస్తున్నారని అన్నారు.

హిల్ట్ పాలసి పేరుతో భూ దోపిడీ యత్నం

హిల్ట్ పాలసీ పేరుతో మరో భూ దోపిడీ యత్నానికి అధికార పార్టీ నేత‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఇది హిల్ట్ పాలసి కాదు టిల్ట్ పాలసీ అంటూ.. ఎద్దేవా చేశారు. హిల్ట్ భావమేమి రేవంతా ?అని అందరూ అనుకుంటున్నారు.. ఫ్యూచర్ సిటీ పేరు తో ప్రజలను భ్రమింప జేస్తున్నారు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉండగా కొడంగల్ ఎత్తిపోతల పథకం దేనికి ?..కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయకుండా లేని వాటికి ప్రాధాన్యత ఏమిటీ ?డబ్బుల సంపాదన కోసం కాదా ? అంటూ విమ‌ర్శ‌లతో ల‌క్ష్మ‌య్య విరుచుకుప‌డ్డారు. నాలుగేండ్లలో 24 లక్షల ఇండ్లు కడతామన్నారు .ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టారు ?విడుదల చేసిన మొత్తం ఎంత ?..రైతు బంధు కోసం శాటిలైట్ ఇమేజి లను వాడుకుంటారట …రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తే కమిషన్లు రావని కోతలు పెట్టే ఆలోచన చేస్తున్నారు.. నేను లేవనెత్తిన అంశాలతో విభేదించిన వారెవ్వరితోనైనా చర్చకు సిద్ధ‌మంటూ పొన్నాల స‌వాల్ విసిరారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది.. ..ఏ వర్గం ఈ రెండేళ్లలో సంతృప్తిగా లేద‌ని అన్నారు. హామీల అమలు ను గాలికొదిలారు …రెండేళ్లలో కే టీ ఆర్ నాయకత్వం లో బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించింద‌న్నారు. స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు కె .కిషోర్ గౌడ్ ,బాలరాజు యాదవ్ ,వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img