epaper
Friday, April 17, 2026
epaper

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి
ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి విన‌తుల వెల్లువ‌
అర్జీల పెండింగ్‌కు నో
నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని కలెక్టర్ల ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్/పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల/జగిత్యాల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి గణనీయ స్పందన లభించింది. వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో వినతులు అందగా జిల్లా కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు తక్షణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పెండింగ్‌ను సహించబోమని హెచ్చరించారు.

కరీంనగర్ : 345 వినతులు, శాఖల వారీ సమీక్ష

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 345 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రతి అర్జీపై క్షేత్రస్థాయి విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు.

పెద్దపల్లి : భూ, గృహ సమస్యలపై దృష్టి

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అసైన్‌మెంట్ భూముల పట్టాలు, వారసత్వ మార్పిడి, డబుల్ బెడ్ రూమ్ గృహాల మంజూరు, దివ్యాంగ కోటా, వైద్య సహాయం వంటి అంశాలపై వినతులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల : 164 అర్జీలు, రెవెన్యూ అధికం

రాజన్న సిరిసిల్లలో ప్రజావాణికి 164 దరఖాస్తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణానికి 25, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు 13 చొప్పున వినతులు వచ్చాయి. ఇతర శాఖలకు కూడా పలు అంశాలపై అర్జీలు అందాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.

జగిత్యాల : 62 ఫిర్యాదులు, సమగ్ర విచారణకు ఆదేశం

జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా స్వీకరించిన వినతులను సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధంగా న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img