epaper
Friday, April 17, 2026
epaper

ప్రశాంతంగా పోలింగ్

ప్రశాంతంగా పోలింగ్
ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో 79.77% పోలింగ్ నమోదు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ గ్రామీణ పంచాయతీలతో పాటు పట్టణ శివార్లలో కూడా నాలుగు గంటల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఓటర్లు ప్రారంభం నుంచే కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపించినప్పటికీ పోలింగ్ సిబ్బంది సమన్వయం వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. తొలి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల నాలుగు జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 4 జిల్లాలో కలిపి 22 మండలాల్లో ఓటింగ్ నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ జరుగుతున్న ప్రధాన కేంద్రాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యక్షంగా సందర్శించి పోలింగ్ ఏర్పాటులను సమీక్షించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎన్నికల అధికారి గరిమ అగ‌ర్వాల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు గ్రామ స్థాయి బృందాలతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రత అంశాన్ని మరింత బలపరిచేందుకు పోలీసు శాఖ అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలీసు అధికారులు వ్యక్తిగతంగా కేంద్రాలను సందర్శించి భద్రత, జనసంచారం, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు.

జిల్లాల వారీగా పోలింగ్ వివ‌రాలు

తొలి విడతలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మొత్తం 22 మండలాల్లో పోలింగ్ జ‌రిగింది. కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో 5 మండలాలు అయిన‌ చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొఠపల్లి రామడుగులో ఓటింగ్ నిర్వహించబడింది. మొత్తం 1,52,408 మంది ఓటర్లలో 1,24,088 మంది ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ 81.42%గా న‌మోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో కరీంనగర్ ముందంజలో నిలిచింది. మహిళలు ఇక్కడ కూడా పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించారు.

జ‌గిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో 7 మండలాలైన భీమారాం, ఇబ్రాహింపట్నం, కాతలాపూర్, కొరుట్ల, మల్లాపూర్, మెడిపల్లి, మెట్‌పల్లిలో పోలింగ్ జరిగింది. మొత్తం 2,18,194 మంది ఓటర్లలో 1,69,486 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.68% న‌మోదు కాగా మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడం ఈ జిల్లాలో ప్రత్యేకంగా నిలిచింది.

పెద్ద‌ప‌లి జిల్లా

పెద్దపల్లి జిల్లాలో తొలి విడతలో 5 మండలాలైన శ్రీరాంపూర్, కామేపూర్, రామగిరి, మంథని, ముత్తారంలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 1,43,856 మంది ఓటర్లలో 1,18,346 మంది ఓటు వేయగా జిల్లాలో పోలింగ్ శాతం 82.27% గా నమోదైంది. ముఖ్యంగా మంథని, కామేపూర్ మండలాల్లో ఉదయం నుంచే ఓటర్ల రద్దీ అధికంగా కనిపించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో చందుర్తి, కొనరాయిపేట్, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్ పోలింగ్ జరిగింది. మొత్తం 1,11,148 మంది ఓటర్లలో 87,339 మంది ఓటు వేసి 76.58% పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. వేములవాడ, కొనరాయిపేట్ మండలాల్లో పోలింగ్ శాతం ఇతర మండలాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 4 జిల్లాలో క‌ల‌పి 6,25,606 మంది ఓటర్లలో 4,99,259 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలి విడత ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 79.77% గా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద అధికారుల నిరంతర పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అనుచిత పరిణామాలు చోటు చేసుకోకుండానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ పూర్తిస్థాయిలో ప్ర‌శాంతంగా ముగిసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img