epaper
Sunday, March 1, 2026
epaper

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు
సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం
23 మంది సజీవదహనం! మరో నలుగురి పరిస్థితి విషమం
ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం
ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసం… అధికారుల దర్యాప్తు ప్రారంభం
స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ఓదార్పు
“ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ

కాకతీయ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో భయానక విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా వినిపించిన గర్జనతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. దట్టమైన పొగలు ఎగసిపడగా, మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమై మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో మరో ఐదుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 23కు చేరింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కొందరి మృతదేహాలు ఛిన్నాభిన్నమై చుట్టుపక్కల ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది.

మంటల్లో చిక్కుకున్న కార్మికులు

పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు బయటకు పరుగులు తీయడానికి కూడా వీలు లేకుండా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తీవ్ర ప్రకంపనలకు సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఇళ్ల కిటికీలు, గోడలు కూడా దెబ్బతిన్నాయి. ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయి ఆందోళనకర వాతావరణం నెలకొంది.

కొనసాగుతున్న సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్వయంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిమితికి మించి బాణసంచా నిల్వ ఉంచడం లేదా భద్రతా నిబంధనల లోపం కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేలుడు కారణాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడికానున్నాయి. ఈ బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సీఎం పరిశీలన

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన హుటాహుటిన శనివారం సాయంత్రం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. హోం మంత్రి అనిత కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దారుణ ప్రమాదంతో వేట్లపాలెం గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒక్కసారిగా కుటుంబాలను కోల్పోయిన వారి ఆర్తనాదాలతో ప్రాంతమంతా మారుమోగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అధికారుల పూర్తి నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ఓదార్పు
“ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాదం జరిగిన అనంతరం సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం, మృతుల కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, ఒక్కసారిగా కుటుంబాలను కోల్పోయిన బాధితుల ఆవేదనను వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటున్నానన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. సీఎం పరామర్శతో బాధిత కుటుంబాలకు కొంత ధైర్యం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. వేట్లపాలెం విషాదంతో దిగ్భ్రాంతిలో ఉన్న గ్రామంలో సీఎం పర్యటన కొంత మానసిక భరోసా కలిగించినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు శ్రీశైలం వెళ్తున్న ఘ‌ట‌న‌... దోర్నాల ఫారెస్ట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img