బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు
జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ
30వ వార్డులో బీఆర్‌ఎస్‌కు పెరిగిన బలం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్‌తో పాటు బుచ్చయ్య, సర్వర్ పాషా, సజ్జు, లింగరావు, నీలం సురేందర్, విక్కీ సందీప్, ఆనంద్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీరికి బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థితిని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. 30వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్ రావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో నిరంతరం గళమెత్తుతున్న నాయకుడని ప్రశంసించారు. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొంటూ, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అన్ని స్థాయిల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట 30వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్ రావు, సీనియర్ నాయకులు చొక్కా రంజిత్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


