మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది
ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ
తెలుగు బుక్ ఆఫ్ రికార్డుతో గుర్తింపు
గ్రామ చరిత్రను ప్రపంచానికి చాటిన సాహిత్య సేవ
కాకతీయ, ఏలూరు ప్రతినిధి : కామవరపుకోట చరిత్రను ప్రతిబింబిస్తూ రచించిన “మా ఊరి తంగేడు పూలు” పుస్తకం తనకు విశేష గుర్తింపు తీసుకొచ్చిందని ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలిపారు. ఈ రచనకు ఇటీవల తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను పుట్టిన ఊరి చరిత్రను గ్రంథరూపంలో తీసుకురావడానికి గ్రామస్తులు అందించిన సహకారం మరువలేనిదని, ప్రోత్సహించిన తన భర్త ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరంలో అనురాధను సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనురాధ ఇప్పటికే పండగ పాటలు, మహతి కవితా సంపుటి, నిత్యమల్లె కథాసంపుటి, శాకాంబరీ ప్రసాదం వంటలు వంటి అనేక రచనలు చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.



