epaper
Friday, April 17, 2026
epaper

అయోధ్య, కాశీ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రత్యేక యాత్రలో అయోధ్య, కాశీ, పూరీ వంటి పవిత్ర ప్రదేశాలతో పాటు బైద్యనాథ్ ధామ్ వంటి ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది. అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ అనే పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ యాత్ర 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమై మొత్తం 10 రోజులు సాగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ స్కీమ్ కింద నడిచే ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం స్టేషన్ల వద్ద నుంచి కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ తరగతులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 639 సీట్లు ఉంటాయి.

మొదటి రెండు రోజుల్లో భక్తులు పూరీ చేరుకుని జగన్నాథ స్వామి దర్శనం చేసుకోగలరు. మూడో రోజు కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. నాలుగో రోజు బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఐదో రోజు వారణాసికి బయలుదేరి ఆరో రోజు కాశీ విశ్వనాథ్ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించొచ్చు. సాయంత్రం గంగా హారతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

తర్వాత అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గఢి వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమై, సెప్టెంబర్ 18న యాత్ర సికింద్రాబాద్‌లో ముగుస్తుంది.

టికెట్ ధరలు కూడా ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టే నిర్ణయించారు. స్లీపర్ క్లాస్ ధర రూ.17,000, 3ఏసీకి రూ.26,700, 2ఏసీకి రూ.35,000గా నిర్ణయించారు. వసతి విషయానికొస్తే, ఎకానమీ క్లాస్ వారికి నాన్-ఏసీ గదులు 4-5 మందికి షేరింగ్‌లో, స్టాండర్డ్ క్లాస్ వారికి 2-3 మందికి నాన్-ఏసీ గదులు, కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ గదులు కేటాయిస్తారు. వాహన సౌకర్యం కూడా క్లాస్ ఆధారంగా ఉంటుంది.

భక్తులకు ప్రతిరోజూ ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. మొత్తం వెజిటేరియన్ ఆహారం మాత్రమే ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు వంటి సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే ఆలయ ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, గైడ్ ఫీజులు, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మినరల్ వాటర్ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.భక్తుల సౌకర్యార్థం రైల్వేలు సుమారు 33 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి. ఈ యాత్రలో భాగమై పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే వారు పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img