epaper
Friday, April 17, 2026
epaper

మీరే మా నమ్మకం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు.. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు. కేరళలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. “కేసీ వేణుగోపాల్ గారు ఎల్లప్పుడూ పేదల పక్షాన, అణగారిన వర్గాల కోసం పోరాడుతూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 2006లో ఆయన ప్రారంభించిన పొంథువల్ మెరిట్ అవార్డులు విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపాయి. ఈ ఏడాది 150 పాఠశాలల్లో 3,500 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులు అందుకుంటున్నారు. విద్య అనేది ఒక శక్తివంతమైన ఆయుధం అని, దాన్ని అందరికీ అందించడం మన బాధ్యత అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. కేరళ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణలో కూడా విద్యాభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశాం. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్య అందించాలన్నదే మా సంకల్పం. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసాం. యువతకు క్రీడల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.

రాబోయే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా భావించాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుంది. ఆర్థిక బలం లేకపోయినా, మీడియా మద్దతు లేకపోయినా, యువత శక్తినే నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోంది. యువతే దేశ భవిష్యత్తు. 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నది మన అందరి కల. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు, మీ భవిష్యత్తు కోసం, దేశం కోసం పోరాటం చేయాలని నేను కోరుతున్నా,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు

మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్య‌ధిక...

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్...

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన‌ గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img