ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు
– బాలాజీ న్యూరో సూపర్ స్పెషలిటీ, జనరల్ ఆసుపత్రి, గజ్వేల్
– డా. వంశీ కృష్ణ వర్దన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎమ్‌డీ, డిఎమ్ (న్యూరాలజీ) ఆధ్వర్యంలో
– ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు శిబిరం
– 20 సంవత్సరాల పైబడిన వారందరూ వినియోగించుకోవాలి
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఆదివారం ఉచిత బీపీ, షుగర్ పరీక్షలను బాలాజీ న్యూరో సూపర్ స్పెషలిటీ, జనరల్ హాస్పిటల్ డా. వంశీ కృష్ణ వర్దన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎమ్‌డీ, డిఎమ్ (న్యూరాలజీ) ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్అండ్‌ఆర్ ఏటిగడ్డ కిస్టాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన వారికి వైద్యుల సలహాలు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులపై సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల్లో సమస్యలు గుర్తించిన వారికి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సపై మార్గనిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బీపీ, షుగర్ సమస్యలు అన్ని వయస్సుల వారిలో పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు పరీక్షలు అత్యవసరమని వైద్యులు సూచించారు. చాలా మందికి ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా తెలియకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచవచ్చని వివరించారు. ఆర్అండ్‌ఆర్ కాలనీ పరిధిలోని 20 సంవత్సరాల పైబడిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


