ఎవరైతే నాకేంటి..ఎస్ఐ అపూర్వ రెడ్డి
* చట్టం ముందు అందరు సమానులే
* అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసిన ఎస్సై
కాకతీయ, చేర్యాల: అనుమతులు తేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు చేర్యాల ఎస్‌ఐ జి. అపూర్వ రెడ్డి తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..గురువారం మండలంలోని అర్జున్ పట్ల గ్రామశివారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉక్కు పాదం మోపడమే కాకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఎంతటి వారైనా చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వత్తాసు పలకడం వారికి అనుకూలంగా వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడం లాంటివి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని, చట్టం ప్రకారం తానంతట తాను పని చేసుకుపోతుందని పేర్కొన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన వారి పిటిషన్ ఆధారపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ తెలిపారు.


