epaper
Friday, April 17, 2026
epaper

పరిహారం ఎప్పుడిస్తారు..? స్పష్టత ఇవ్వండి!

పరిహారం ఎప్పుడిస్తారు..? స్పష్టత ఇవ్వండి!
సిగాచి బాధితులపై ప్రభుత్వ వైఖరికి హైకోర్టు ఆగ్రహం
ఎంత ఇస్తామన్నారో.. ఎంత ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నలు
సిట్‌ పరిహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం

కాకతీయ, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల పరిహారంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. పరిహారం విషయంలో స్పష్టత లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. “ఎంత పరిహారం ఇస్తామని చెప్పారు? ఇప్పటివరకు ఎంత ఇచ్చారు? మిగతా మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారు?” అంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిగాచి ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన 56 మంది, ఆచూకీ లభించని 8 మంది, 28 మంది క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు.

ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపాటు
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పరిహారం పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఇంకా నిరీక్షణలో ఉండగా, స్పష్టమైన షెడ్యూల్ లేకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పరిహార ప్రకటనలు మాత్రమే సరిపోవని, అమలు ఎలా జరుగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై సిగాచి ఫార్మా కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం బాధితులకు అందాల్సిన పరిహారం ఎంత అనే వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కీలక శాఖలకు నోటీసులు
ఈ కేసులో అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. పరిహారానికి సంబంధించిన చట్టపరమైన బాధ్యతలు ఎలా నిర్వర్తించారో వివరించాలని ఆదేశించింది. ప్రమాదం జరిగి చాలా కాలం గడిచినా పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడం బాధిత కుటుంబాల్లో ఆందోళనను పెంచుతోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో అయినా ప్రభుత్వం, కంపెనీ బాధ్యతగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు తదుపరి విచారణలో ప్రభుత్వ వివరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి టీజీఎండీసీ ఎండీ భ‌వేశ్ మిశ్రాకు లారీ అసోసియేష‌న్...

రేవంత్ అబద్ధాల రాజకీయాలు

రేవంత్ అబద్ధాల రాజకీయాలు బ‌డ్జెట్ ప్ర‌సంగం సాక్షిగా బ‌య‌ట‌ప‌డ్డాయి అసెంబ్లీ వేదికగా సీఎం ప్రజలను...

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు డైరెక్టర్ ఫోటోతో ఫేక్...

రైల్వే పరీక్ష కీ విడుదల

రైల్వే పరీక్ష కీ విడుదల పారా మెడికల్ పోస్టుల ప్రాథమిక ఆన్సర్ కీ...

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో...

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన...

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌ వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది సామాజిక న్యాయం...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img