గాంధీ ఆదర్శాలతో ముందుకు సాగాలి
కొమురవెల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్
కాకతీయ, చేర్యాల : నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. గాంధీ మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని మహాదేవుని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, కొమురవెల్లి పట్టణ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజు, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ బత్తిని నరసింహులు గౌడ్,కొమురవెల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య యాదవ్, మండల బిసి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


