epaper
Saturday, November 15, 2025
epaper

విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలి

  • 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖ రీజియన్ కే వస్తున్నాయి
  • ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనపై దృష్టిపెడతాం
  • టీసీఎస్, కాగ్నిజెంట్ లకు 99 పైసలకే భూమి కేటాయింపు తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా
  • విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

కాక‌తీయ‌, విశాఖపట్నం : విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ రీజియన్ లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ పై ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సిఫీ ఆధ్వర్యంలో డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో వేగంగా పరిగెడుతున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ విషయంలో ఇప్పటికే కమిట్ మెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్ సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆర్సెల్లర్ మిట్టల్ తో పాటు ఫార్మాలో సుమారు 5 కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు మేం ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 50 శాతం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ కు వస్తున్నాయి. అభివృద్ధి పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉంది

నవంబర్ 14, 15 సీఐఐ భాగస్వామ్య సదస్సును కూడా విశాఖలో నిర్వహిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో విశాఖకు, ఏపీకి పెద్ద ప్రకటనలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాలి. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే అందులో గ్రేటర్ విశాఖ రీజియన్ కనీసం 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ప్యాలెస్ లు కట్టేందుకు విశాఖకు రాలేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు తీసుకురావాలి, వాటిని గ్రౌండ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం

నవంబర్ లో టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది. కాగ్నిజెంట్ సీఈవో కూడా నవంబర్ లో వస్తున్నారు. వారి కొత్త ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. డిసెంబర్ లో వారి డెవలప్ మెంట్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నారు. గూగుల్ విషయానికి వస్తే రేపు ఢిల్లీకి వెళ్లి పెద్దఎత్తున ప్రకటన చేయబోతున్నాం. 99పైసలకే ఎకరా భూమి కేటాయిస్తున్నారని నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి ఇవ్వడం తప్పా అని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైసీపీ ఐదేళ్లలో తీసుకురాలేని పరిశ్రమలను మేం 16 నెలల్లోనే తీసుకువచ్చాం. అది మా చిత్తశుద్ధి. ప్రతి సంస్థను మేం గ్రౌండ్ చేస్తాం. నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాం. గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ కు కావాల్సిన ఎకో సిస్టమ్ పై చర్చించాం. రోడ్లు, ప్రభుత్వ భూముల వివరాలపై చర్చించాం.

విశాఖలో రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది చేయాలంటే సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో నాడు మీ ముందుకు వచ్చాం. 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ అరాచకాలను ప్రజల ముందు ఎండగడతాం. నకిలీ మద్యం విషయంలో కూడా చాలా పెద్ద తతంగం ఉంది. హోం వర్క్ జరుగుతోంది. ప్రజాకోర్టులో వారిని దోషిగా నిలబెడతామన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img