రమేష్ ను పరామర్శించిన వీరన్న..
కాకతీయ,కారేపల్లి: మండల పరిధిలోని మొట్లగూడెం పంచాయతీ చింతలపాడు గ్రామానికి చెందిన వాంకుడడోత్ రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. కాలికి గాయం కావడంతో ఇంట్లోనే ఉంటు చికిత్స తీసుకుంటున్నాడు. అతని యోగక్షమాలను గురువారం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరుడు అజ్మీర వీరన్న అక్కడికి వెళ్లి పరామర్శించి మనోధార్యాన్ని కల్పించాడు. ఈ కార్యక్రమంలో స్థానికులు బాదావత్ అనిల్ ,వాంకుడోత్ పూర్ణ,ప్రశాంత్,సతీష్,హరిప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


