ఆన్‌లైన్లోనే యూరియా అమ్మకం
వ్యవసాయ అధికారి వెంకటేశ్
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలోని రైతు వేదికలో శనివారం రోజు మండలంలోని సొసైటీ, ఆగ్రోస్, ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్లకు వ్యవసాయ అధికారి జి. వెంకటేశ్ ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. యూరియాను బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9 గంటలకు లేదా మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఆన్లైన్ లో బుకింగ్ కోసం పొందుపరచాలని ఆదేశించారు. రైతులు యూరియా కోసం రోజంతా ఫోన్ చూసుకుంటూ గందరగోళ పడకుండా పై సమయం లో మాత్రమే చెక్ చేసుకొని యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రాజ్ కుమార్, డీలర్లు పాల్గొన్నారు.


