మహిళా క్రికెట్లో మహారాణి..
దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: వన్డే వరల్డ్‌కప్ విజయంతో భారత మహిళా క్రికెట్ సుదీర్ఘ కలను సాకారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త ఏడాదిలో చరిత్ర సృష్టించింది. టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా అప్పుడు రికార్డు నెలకొల్పిన తను.. ఈసారి దిగ్గజాలకు సాధ్యమవ్వని ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా హర్మన్‌ప్రీత్ అవతరించింది. ఆస్ట్రేలియా గడ్డపై గురువారం రెండో టీ20లో ఆడడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ ఫీట్ సాధించింది. దూకుడైన ఆటతో భారత జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ తనపేరిట పలు రికార్డులు రాసుకుంటోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన హర్మన్‌ప్రీత్.. అత్యధిక మ్యాచ్‌లు ఆడేసింది. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ సుజీ బేట్స్ రికార్డును బ్రేక్ చేస్తూ… 356వ మ్యాచ్‌లో ఆడింది భారత కెప్టెన్.


